హుస్నాబాద్ లో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్

– హమాలీ కార్మికులతో సమావేశం
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని 14 వ వార్డులో శనివారం ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులు, వార్డు ప్రజలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు. వార్డు ప్రజలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హుస్నాబాద్ పట్టణం లోని ఆదర్శ హమాలీ సంఘం కార్మికులతో కలిసి కార్మికుల సమస్యలు, ఆరోగ్య క్షేమలు అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్  హుస్నాబాద్ లో తన గెలుపుకు కృషి చేసిన హమాలీ సంఘం కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే హమాలీ సంఘం కూలీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజులరెడ్డి, ప్రజా ప్రతినిధిలు తదితరులు పాల్గొన్నారు.