నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మార్నింగ్ వాక్ చేశారు.పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు. పట్టణంలోని పలు సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వైండింగ్ , నాళాల నిర్మాణాలను పరిశీలించారు. పట్టణంలోని విజయ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించారు. పడి రైతులకు పాలతో ఇలాంటి లాభాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు, కేడం లింగమూర్తి నాయకులు తదితరులు పాల్గొన్నారు.