మంత్రి ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే కర్ణాటక రావాలి

– వేల్పుర్ చౌరస్తాలొ రేపు మధ్యాహ్నం చర్చకు రావాలి
– విమానంలో కర్ణాటకకు భద్రంగా తీసుకెళ్తా
– కర్ణాటక చిక్ బల్లాపుర్ ఎమ్మేల్యే ప్రదీప్ ఈశ్వర్
నవతెలంగాణ- వేల్పూరు: మంత్రి ప్రశాంత్ రెడ్డి కర్ణాటక లో  పథకాలు అమలు కావడం లేదని ఇక్కడ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనిక ర్ణాటక ఎమ్మేల్యే ప్రదీప్ అన్నారు. ప్రశాంత్ రెడ్డికి దమ్ముంటే బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు  వేల్పూరు చౌరస్తాలొ చర్చకు వచ్చి, అమలు జరుగుతున్న పథకాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు కర్ణాటక రావాలని సవాల్ విసిరారు. నియోజవర్గంలో దోపిడీ చేసి కోట్ల రూపాయాలు సంపాదించిన ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తు ఊరుకోం అన్నారు. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు వేల్పూరు చౌరస్తాలో తాను కూర్చుంటానని ప్రశాంత్ రెడ్డి అక్కడకు రావాలని సవాల్ చేశారు. తాము చేసిన పనుల మీద ఓట్లు అడిగే దమ్ము లేక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదని కాంగ్రెస్ 70 స్థానాలకు పైగా బంపర్ మెజారిటీతో గెలుస్తాం అని తెలిపారు. ముత్యాల సునీల్ కుమార్  బంపర్ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.