క్షతగాత్రులకు అండగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి

– తన ఎస్కార్ట్‌ వాహనంలో బాధితులను ఆస్పత్రికి పంపిన వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి గురువారం నియోజకవర్గ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వస్తుండగా మేడ్చల్‌ నుంచి కొంపల్లి రూట్లో ప్రమాదవశాత్తు బైకుపై నుంచి పడిపోయిన భార్యభర్తలతో పాటు చిన్నారిని ఎస్కార్ట్‌ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. బైకుపై నుంచి కింద పడిపోయిన వారిని చూసి మంత్రి వెంటనే తన కాన్వాయిని ఆపించారు. వారిని పరామర్శించి యోగ క్షమాలు అడిగారు. మనోధైర్యం చెప్పారు. మహిళకు గాయాలు కావ డంతో ఆమెతో పాటు భర్తను, చిన్నారిని తన ఎస్కార్ట్‌ వాహనం ఎక్కించి ఆస్పత్రికి పంపించారు. తమ కోసం మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి వేములకు బాధితులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు.