125 కోట్ల తో అభివృద్ధి చేసిన ఘనత మంత్రి ప్రశాంత్ రెడ్డి దే     

– వంద పడకల ఆస్పత్రి మనలను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలానికి ఇప్పటివరకు అన్ని రంగాలలో 125 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనిషిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిలుస్తున్నాడని జెడ్పిటిసి చౌటుపల్లి రవి టిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య జిల్లా నాయకుడు కన్నె సురేందర్  అన్నారు పట్టణ కేంద్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను మంగళవారం  పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బాల్కొండ నియోజకవర్గంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్ని వర్గాలకు చేసి చూపిస్తున్నాడన్నారు ఇందులో భాగంగానే భీంగల్ కు ఇప్పటివరకు 125 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టారన్నారు ప్రజారోగ్య రక్షణకు భీంగల్ లో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి మరో రెండు మూడు నెలల్లో పూర్తికానున్నదని దీంతో ప్రజలకు అన్ని రకాల కార్పొరేట్ వైద్య సేవలు అందనున్నాయన్నారు దీంతోపాటే భీంగల్  మండల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని సుసాధ్యం చేసేందుకు బస్ డిపోను పున ప్రారంభించనున్నారని వాటి పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు అలాగే భీంగల్ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పరిధిని మరింత పెంచేందుకు 12 కోట్లు పాఠశాలలకు మూడు కోట్లను మంత్రి మంజూరు చేశారని వారు తెలిపారు కనుక రానున్న రోజుల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని లక్ష మెజారిటీ తో గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు పనులను కూడా శరవేగంగా పూర్తి చేయాలని ఏ  ఈ కి సూచించారు. వీరి వెంట కౌన్సిలర్ సతీష్ గౌడ్ టిఆర్ఎస్ నాయకుడు తిరుపతి తదితరులు ఉన్నారు