తునికాకు కూలీలకు బోనస్ విడుదల చేసిన మంత్రి

Minister released bonus for Tunica workersనవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర అటవీ డివిజన్ కార్యాలయంలో సోమవారం  రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి  అనసూయ (సీతక్క) ఒక కోటి 55 లక్షల 74 విలువైన చెక్కులను తునికాకు కూలీలకు బకాయి బోనస్ అందించారు. ముందుగా రేంజ్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. అనంతరం కలెక్టర్ దివాకర్ టిఎస్ మొక్కను నాటి నిరంధించారు. టీఎస్ డీఎఫ్ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి మంగపేట తాడువాయి మండలాలకు చెందిన 141 గ్రామాల తునికాకు సేకరణ లబ్ధిదారులకు ఒక కోటి 55 లక్షల 74 వేల రూపాయల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని వివరించారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సృజన్ కుమార్ ఎంపీడీవో జవహర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.