
రేపు మండలంలోని బుసాపురం గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొంటారని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రాథమికొన్నత పాఠశాల బుస్సాపూర్, గోవిందరావుపేట మండలం నందు గౌరవ గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమానికి మరియు మన ఊరు మన బడి పనులు పూర్తయినందున ప్రారంభించుటకు విచ్చేయుచున్నారని తెలిపారు.