నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రముఖ రచయిత, దివంగత పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి బి. విజయభారతి పార్దీవ దేహానికి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) నివాళి అర్పించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బేగం పేటలోని వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్దీవదేహంపై పూల మాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా విజయభారతి సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సాహితీ రంగానికి విజయభారతి సేవలు మరువలేనివన్నారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్, జ్యోతిరావు పూలే జీవితాలను, పోరాటాలను తెలుగు ప్రజలకు తన రచనల ద్వారా అందించిన విజయభారతి మరణం తెలుగు ప్రజా సాహిత్యానికి, అభ్యుదయ వాదులకు తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.