మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన నస్పూరి నాగరాజు (కాంగ్రెస్ పార్టీ మంథని నియోజకవర్గ సోషల్ మీడియా ఇక్చార్జి) ఇటీవల తలకు కంతియై అనారోగ్యంతో హైదరాబాద్ లో నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు దృష్టికి తీసుకపోయాడు. వెంటనే స్పందించిన మంత్రి శనివారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి చేరుకొని నాగరాజును పరమార్షించారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని బారోసానిచ్చారు. నాగరాజు ఆరోగ్య పరిస్థితిపై విద్యాధికారులతో మాట్లాడారు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ సంగ్గెం రమేష్,మోత్కురి మహేష్ పాల్గొన్నారు.