ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతో ఉండాలి: మంత్రి సీతక్క 

Every leader, activist should be with the people: Minister Sitakkaనవతెలంగాణ – గోవిందరావుపేట
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభలు నివాళులు అర్పించిన సీతక్క కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడు కార్యకర్త నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు సీతక్క అన్నారు. గురువారం  మండల కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సభ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. స్థానిక నాయకులు కార్యకర్తలు కలిసి ముందుగా దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆహార భద్రత చట్టం, భూ పరిహార చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఆర్థిక పితామహుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు.
అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు దశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం అవలంబిస్తున్న అందిస్తున్న పథకాలు సామాన్య ప్రధానికానికి అందుతున్నాయా లేదా గమనించాలని నిత్యం ప్రజలతో సంబంధాలు పెంచుకోవాలని ప్రజల మధ్యనే ఉండి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా అధికారుల సహాయ సహకారాలతో ముందుకు సాగాలని సూచించారు. అందరము సమిష్టిగా పనిచేస్తేనే స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో విజయం సాధిస్తామని సూచించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, పంట బోనస్ త్వరలో ఇవ్వనున్న రైతు బీమా, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, ప్రభుత్వ వసతి గృహాలు అంగన్వాడి సెంటర్లు సరి అయిన నాణ్యత పాటిస్తున్నాయా లేదా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా నాయకులు కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేయాలని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కొత్త కొత్త ఆలోచనలతో కొత్త పథకాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యోన్ముఖుల కావాలని అన్నారు.
కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. పనిచేస్తున్నట్టు నటించే వారికి ఏనాడు ప్రాధాన్యత లభించదని ఉదాహరించారు. ఎంపీటీసీ ఇలా వారీగా విభజించి గతంలో చేసిన పనులు జరిగిన అభివృద్ధి జరిగిన పొరపాట్లను బేరీజు వేసుకొని ఈసారి పొరపాట్లకు తావు లేకుండా విజయోత్సాహంతో ఎదుర్కోవాలని కార్యకర్తలను నాయకులను ప్రోత్సహించారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త సమన్వయంతో పని చేయాలి అని, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు ప్రభుత్వం పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళలను అభివృద్ధి పథంలో నడుపుతున్నదని, అలాగే రైతులకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులకు 2018 నుండి డిసెంబర్ 9 2023 వరకు పంట రుణాలు తీసుకున్న వారికి 2 లక్షల పంట రుణమాఫీ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, అలాగే రైతు భరోసా కూడా నూతన సంవత్సరం సందర్భంగా రైతులకు అందిస్తాం అని, అలాగే రైతు కూలీలకు కూడా 12000 రూపాయల భరోసా అందిస్తాం అని కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా గడప గడపకు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నేను ఉంటానని, ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులకు అందేలా నాయకులు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు సముచిత పదవులు దక్కుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, ములుగు జిల్లా రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.