ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి సీతక్క

– పంభాపూర్ శివాలయానికి ప్రహరీ గోడ నిర్మాణం
– హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
నవతెలంగాణ – తాడ్వాయి
పంభాపూర్, దాని పరిసర గ్రామాల భక్తుల ప్రజల ఎన్నో సంవత్సరాల కల నెరవేరింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సునీతక్క గ్రామంలోని శివాలయానికి ప్రహరీ గోడ నిర్మిస్తానని వాగ్దానం చేసింది. మాట ప్రకారం వెంటనే గెలవగానే అధికారంలోకి రాగానే పంబాపూర్ శివాలయానికి 5 లక్షల రూపాయల ప్రహరీ గోడ నిర్మించారు. శివాలయానికి ప్రహరీ గోడ లేకపోవడంతో భక్తులకు గ్రామస్తులకు ఇబ్బందులు ఏర్పడేది. ఇప్పుడు ఆ ప్రహరీ గోడ నిర్మాణంతో ఇబ్బందులు తప్పాయి. ప్రశాంతంగా వచ్చి దైవ జ్ఞానం చేసుకుని ఆధ్యాత్మిక చింతన పొంది వెళ్తున్నారు. కాగా ఇంకా కొంత నిర్మాణం పూర్తయ్యేది ఉంది. దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సీతక్క హామి ఇచ్చారు. మంత్రి సిద్ధంగా ఎన్నికల హామీ నిలబెట్టుకుని ప్రహరీ గోడ నిర్మించినందుకు పంబాపూర్ గ్రామస్తులు దాని పరిసర గ్రామాల భక్తులందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.