నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడారం సమ్మక్క దేవత ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య అకాల మరణం పట్ల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య మరణం సమ్మక్క భక్తులకు తీరని లోటన్నారు. వన దేవత సమ్మక్కకు ఇంతకాలం పూజలు చేసిన మల్లెల ముత్తయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట కాలంలో ఆయన కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని చెప్పారు.