జాతర కోసం నిరంతరం కష్టపడ్డ అధికారులు, మీడియా కు కృతజ్ఞతలు: మంత్రి సీతక్క

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పత్రికా సమావేశం
– జాతర కోసం నిరంతరం కష్టపడ్డ అధికారులు, మీడియా కు కృతజ్ఞతలు
– జాతర నిర్వహణకు అత్యధిక నిధులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు, మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
– దేవాదాయ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
– జిల్లా కలెక్టర్, ఎస్పి, ఇతర 20 శాఖల అధికారులు జాతర ఏర్పాట్లకు కష్టపడ్డారు
– వార్తలను ఎప్పటికపుడు బయట ప్రపంచానికి చెరవేసిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు
నవతెలంగాణ – తాడ్వాయి
వరదల మూలంగా మేడారం రోడ్లు భవనాలు మునిగిపోయాయి. తక్కువ టైంలో వాటిని మరమ్మతులు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఏషియా లోనే కాదు ప్రపంచం లోనే అతి పెద్ద జాతర మధ్యాహ్నం వరకే కోటి 35 నుండి 45 లక్షల భక్తులు వచ్చినట్టు ప్రాథమిక అంచనరవాణా శాఖ 6000 బస్సులను నడిపింది. నిన్న సాయింత్రం వరకు 12 వేల ట్రిప్పులు10 నుండి 12 కిమీ వైశాల్యం లో ఇంత మంది రావడం ఈ ప్రాంత బిడ్డగా గర్వకారణంఎండ తీవ్రత వున్నా రద్దీ తగ్గలే.. గంటలో వనప్రవేశం ఉన్న ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మేడారం వచ్చిన భక్తులు అందరికీ తల్లుల దర్శనం అయ్యేంతవరకు యంత్రాంగం పనిచేస్తుంది 5090 మంది పిల్లలు తప్పి పోయారు.ఇప్పటికే 5062 పిల్లలను వారి కుటుంబానికి అప్పజెప్పాము. మిగిలన పిల్లలు సురక్షితంగా ఉన్నారు. వారి కుటుంబసభ్యులు జంపన్న వాగు దగ్గర వున్నా  మిస్సింగ్ పాయింట్ దగ్గరకు రండి జాతర లోటుపాట్లు ఉంటే స్వీకరిస్తామ రానున్న జాతరకు సరి చేసుకుంటాం.