మేడారంలో ఇటీవల మృతి చెందిన సమ్మక్క పూజారి మల్లెల ముత్తయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆలకుంట రమేష్ మృతుల కుటుంబాలను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పూజాల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, స్థానిక నాయకులు తో కలిసి పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ఆమె వెంట కలెక్టర్ దివాకర టిఎస్, కలెక్టర్ శ్రీజ, ఎస్పీ శబరీష్, డి.ఎస్.పి రవీందర్, వివిధ శాఖల అధికారులు, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు అనంతరెడ్డి, నాయకులు ఇరుసవడ్ల వెంకన్న, రేగ కళ్యాణి, అర్రెం వచ్చు పటేల్, ఆషాడం మల్లన్న, పీరీల వెంకన్న, ఇప్ప నాగేశ్వరరావు, తండాల శ్రీను, చెర్ప రవీందర్, రానా రమేష్, వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.