వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క..

నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను శుక్రవారం సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వన దేవతలను  రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,  శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ పి.శ్రీజ లతో కలిసి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాజేంద్రం, పూజరుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, స్థానిక తహశీల్దార్ రవీందర్, పూజారులు సిద్దబోయిన మునెందర్, కాక సారయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగ కళ్యాణి, పూజార్లు ఎండోమెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.