ఉత్తమ ఉపాద్యాయురాలీని సన్మానించిన మంత్రి సీతక్క

నవతెలంగాణ – జుక్కల్: ఉత్తమ ఉపాద్యాయురాలీని రాష్ట్ర పంచాయత్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అదివారం నాడు సన్మానించడం జర్గింది. జుక్కల్ మండలంలోని లొంగన్ ఎంపిపీఎస్ ప్రవీణ ఎస్జీటీ తెలుగు టీచర్ గా ఉపాద్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని సీవీఆర్, జీవిఆర్ గార్డేన్ లో ఏర్పాటు చేసిన సావిత్రి బాయి పూలే జయంతి వారోత్సవాలలో భాగంగా ఉత్తమ టీచర్ ఆవార్డును అందించారు. లొంగన్ గ్రామ పాఠశాలలో ఉపాద్యాయ రాలిగా విద్యార్థులను మంచి బావీ పౌరులుగా తీర్చి దిద్దడానికి తన వంతుగా కృషి చేస్తున్నందుకు, విద్యార్థుల అబ్యాసన నైపూణ్యం పెపొందించడంలో తగిన ప్రణాళిక రూపొందిస్తు, వాటిని అమలు చేస్తూ, విద్యార్థుల ప్రతిభను వెలికి తీసీ ఉత్తములుగా తీర్చి దిద్దుతామని ఆవార్డు గ్రహిత ప్రవీణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅథితి రాష్ట్ర మంత్రి సీతక్క, మండలానికి చెందిన పలువురు టీచర్లు తదితరులు పాల్గోన్నారు.