ఇటీవల అనారోగ్యంతో బయ్యక్కపేట గ్రామానికి చెందిన మంత్రి సీతక్క చిన్ననాటి స్నేహితురాలు ఏఎన్ఎం మహిపతి గౌరీ, వారి సోదరుడు చందా శేషగిరి ఇద్దరు వారం రోజుల తేడాతో మృతి చెందడంతో వారి కుటుంబాలను ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చిన్న నాటి స్నేహితురాలు మైపతి గౌరి మరణం నన్ను ఎంతగానో భాదించింది అని వారు ఎక్కడ ఉన్నా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి వర్యులు సీతక్క తెలిపారు. వారు మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవి చందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లు దేవేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, మాజీ సర్పంచ్ ముజాఫర్ హుస్సేన్, రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.