రేపు మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు..

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్
నవతెలంగాణ – తాడ్వాయి
రేపు మంగళవారం మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో బొల్లు దేవేందర్ మాట్లాడుతూ రేపు మంగళవారం ఉదయం 9.00 గంటలకు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద మన ప్రియతమ నేత, ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యుల దనసరి సీతక్క  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని జిల్లా నాయకులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీలు, కార్యకర్తలు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు, సీతక్క అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.