త్వరలో జరగబోయే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముందుకు పంచాయతీ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవ అభినందనీయమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మంత్రి తీసుకునే నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వమని తెలిపారు. దాదాపు 550 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరుగుతుందని, అర్హులను బట్టి ఆఫీస్ సబార్డునెట్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో నియామకాలు జరుగుతాయని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కారుణ్య నియామకాలకు బ్రేక్ పడిందని, అర్హులైన వారికి వెంటనే నియామకాలు చేపట్టేందుకు మంత్రి చొరువ అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు, కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుంది.