గ్రామాల్లో స్థానిక జెడ్పిటిసి,ఎంపీటీసీల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల పదవీకాలం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలను శాలువాలతో సత్కరించి మాట్లాడారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలల్లో ఎంపీటీసీలు భాగస్వాములు అయ్యారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎంపిపి పంథకానీ సమ్మయ్య,ఎంపిటిసి సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.