నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా మంత్రి శ్రీధర్ బాబు

నేషనల్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా మంత్రి శ్రీధర్ బాబు– నియామకంపై కాంగ్రెస్ నాయకుల హర్షం
నవ తెలంగాణ మల్హర్ రావు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకొంది. నేషనల్ మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్ర కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నియామకంపై భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు సోమవారం హర్షం వ్యక్తం చేసి మంత్రిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టోను చేరవేయాలనేదానిపై అన్వేషించి పార్టీకి రిపోర్టు ఇస్తుందని, ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తే పార్టీకి బెన్ ఫిట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు లభిస్తుంది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచేందుకు మేనిఫెస్టో ప్రభావం ఎంత వరకు ఉంటుంది. తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు