నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. మండలంలోని కొయ్యుర్ నుంచి రుద్రారం వరకు రాష్ట్ర ప్రణాళిక నిధుల నుంచి మంజూరైన రూ.20 కోట్ల డబుల్ తారు రోడ్డు నిర్మాణ పనులకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి శంకుస్థాపన చేశారు. వళ్లెంకుంట గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్య,వైద్యం,పల్లెల్లో మెరుగైన రవాణ సౌకర్యాలు కల్పించడమే తాము ముందుకు వెళుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం అంధించే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, జెడ్పీటీసీ అయిత కోమల రాజిరెడ్డి,వైస్ ఎంపీపీ బడితేల స్వరూప రాజయ్య, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సవెందర్,తాడిచెర్ల పిఏసిఎస్ తాత్కాలిక చైర్మన్ ఇప్ప మొoడయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి, ప్రధాన కార్యదర్శి వేల్పుల రవి, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,సింగిల్ విండో డైరెక్టర్లు వొన్న తిరుపతి రావు,సంగ్గెం రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.