తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన ఎంఎల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించారు.