రోజు అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు

– బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లకు కరెంట్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌
నవతెలంగాణ- మల్హర్ రావు
బీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్లకు కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేని రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దుద్దిళ్ల గురువారం మాట్లాడారు 2014కు  ముందు కరెంటే లేనట్లు, బీఆర్‌ఎస్‌ నాయకులే కరెంట్ ను కనిపెట్టినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.అలాగే నీళ్ల గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకున్నారని తెలిపారు.