
మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో స్తంభంపల్లి గ్రామ తాజా మాజి సర్పంచ్ జాడి రాజయ్యకు తీవ్ర గాయాలై హన్మకొండలోని అజారా ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పడుతున్నాడు.విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు బుధవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాజయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.