హోంగార్డు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు..

నవతెలంగాణ – మంథని
మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన హోంగార్డ్ ఆరేళ్లి సంపత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సంపత్ మృతికి గల కారణాలను మంత్రి శ్రీధర్ బాబు అడిగి తెలుసుకొని మృతుని కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామన్నారు. శ్రీధర్ బాబు వెంట మండల పార్టీ అధ్యక్షులు అయిలి ప్రసాద్, ఎంపీపీ కొండ శంకర్, మీడియా కోఆర్డినేటర్ ఆరెల్లి కిరణ్ గౌడ్, రామ్ రాజశేఖర్, బూడిద శంకర్, తదితరులు పాల్గొన్నారు.