
అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అత్యధిక మెజార్టీతో గెలుపొంది,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి క్యాబినెట్ మంత్రివర్గంలో కీలకమైన మంత్రి పదవి చేపడితే వేములవాడ రాజన్న సన్నిధి నుండి కొండగట్టు అంజన్న సన్నిధికి వరకు పాదయాత్ర ద్వారా వస్తానని శనివారం హనుమాన్ జయంతి పురస్కరించుకుని మండలంలోని నాచారం గ్రామానికి చెందిన మామిండ్ల శ్రీనివాస్ గురుస్వామి మొక్కును చెల్లించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తమ నాయకుడు గెలిస్తే వేములవాడ రాజన్న సన్నిధి నుండి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన వస్తానని మొక్కుకోవడం జరిగిందన్నారు.