నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం, శంకుస్థాపనలు చేయునట్లుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రణాళిక నిధుల నుండి రూ.20 కోట్ల నిధులతో కోయ్యూరు నుండి రుద్రారం వరకు డబల్ ఆర్అండ్ బి రోడ్డుకు కొయ్యూరు వద్ద శంకుస్థాపన,వల్లెంకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం,మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో తాడిచెర్ల,వళ్లెంకుంట,కొయ్యుర్,మల్లారం గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన పలు సిసి రోడ్లు ప్రారంభోత్సవం ఉంటుందన్నారు.