నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నేడు గురువారం మండలంలోని కొండంపేట గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య తెలిపారు. అలాగే కాటారం మండలంలో నూతనంగా నిర్మించిన మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ను, సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని అన్నారు. అనంతరం రెడ్డి గాండ్ల కుల బంధువుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్ రెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి హాజరు కానున్నట్లుగా తెలిపారు.