నేడు మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

నవతెలంగాణ – మల్హర్ రావు
నేడు మంథని నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించున్నారు. ఉదయం 11 గంటలకు గోదావరిఖనిలో ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు గదులు ప్రారంభం, మధ్యాహ్నం 1 గంటకు మంత్రి వ్యక్తిగత సహాయకులు ప్రవీణ్ వివాహానికి మహాదేవపూర్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3-30 లకు మండలంలోని మల్లారం గ్రామపరిదిలో కస్తూరిబా బాలికల పాఠశాలలో అదనపు గదులు ప్రారంభం, సబ్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన,తాడిచెర్ల గ్రామంలో ఆర్అండ్ఆర్ కింద రూ.4కోట్లతో అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, సిసి డ్రైన్, అంగన్వాడి స్కూల్, ప్రైమరీ స్కూల్ ,కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్, న్యూ ఎలక్ట్రిక్ నూతన లైన్స్, దాదాపుగా రూ. 48 లక్షలతో మండల నూతన తహశీల్దార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం.తాడిచెర్ల గ్రామంలో గ్రంథాలయానికి శంకుస్థాపన, సబ్ హెల్త్  సెంటర్ శంకుస్థాపన, డాక్టర్ విశ్రాంత భవనం శంకుస్థాపన.మోటే వాగు ఒర్రెపై రొడ్డం రూ.40లక్షలు నిర్మాణ కొరకు శంకుస్థాపన,మత్స్యశాఖ ఆధ్వర్యంలో 9మంది లబ్ధిదారులకు ఆటో ట్రాలీలు అందజేసి,రాత్రి 8.30 గంటలకు మంథని బస్టాండ్ నుంచీ హైదరాబాద్ వరకు ప్రతిరోజూ వేళ్ళు రాజధాని ఏసీ సర్వీస్ బస్సును ప్రారంభిస్తారని మంత్రి సహచరుడు చంద్రశేఖర్ తెలిపారు.