తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, అనుబంధ శాఖల చైర్మన్ లు టెస్కాబ్ బ్యాంక్ అధికారులతో రుణమాఫీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ బ్యాంక్ రూ.2వేల కోట్ల టర్నోవర్ సాధించిన సందర్భంగా చైర్మన్ మర్నేని రవీందర్ రావు ని మంత్రి వర్యులు అభినందించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. రఘునందన్ రావు (ఐఎస్ఐ), సిసి&ఆర్‌సిఎస్ పి. ఉదయ్ కుమార్ (ఐఏఎస్), టెస్కాబ్ సిజిఏం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.