రైతుల విన్నపాన్ని అమలు చేసిన మంత్రి తుమ్మల

– ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డికి కృతజ్ఞతలు – ఆయిల్ ఫాం సాగు దారులు.
నవతెలంగాణ – అశ్వారావుపేట

వివిధ జిల్లాల నుంచి తరలిస్తున్న లేత పామాయిల్ గెలలు ను అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ కే తరలించాలని ఆయిల్ఫైడ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం మండలంలోని నారంవారిగూడెం సమీపంలోని ఆయిల్ఫైడ్ డివిజన్ కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఇతర జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్న పామాయిల్ తోటల్లో గెలల దిగుబడి మొదలు కాగా, ఈ గెలలు అన్నీ లేత కావడంతో అప్పారావుపేట ఫ్యాక్టరీ లో క్రషింగ్ చేస్తే నూనె దిగుబడి శాతం తగ్గే అవకాశం ఉందని,దాంతో పామాయిల్ రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ఫైడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి కు వినతి చేశామని, దీంతో వారు తక్షణమే స్పందించి లేత గెలలు ను అశ్వారావుపేట ఫ్యాక్టరీ కి, ముదురు తోటల ద్వారా వచ్చే గెలలు దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీ కి తరలించి క్రషింగ్ చేసేలా ఆదేశించారని చెప్పారు. పామాయిల్ రైతుల సమస్యపై తక్షణమే స్పందించిన రాష్ట్ర మంత్రి తుమ్మల,ఆయిల్ఫైడ్ చైర్మన్ కు పామాయిల్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇతర జిల్లాల నుంచి గెలలు రవాణా చేస్తున్న ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో సాగులో ఉన్న గెలలు రవాణా ఛార్జీలు ఆ కంపెనీలే చెల్లిస్తాయని అన్నారు.ఆయిల్ ఫాం సాగు, గెలల దిగుబడి, నూనె దిగుబడి శాతం పై రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా కోరారు.

ఈ సమావేశంలో రైతు ప్రముఖులు మొగళ్ళపు చెన్నకేశవ రావు,కోటగిరి సీతారామస్వామి,బండి భాస్కర్,సీమకుర్తి వెంకటేశ్వరరావు,కేదాసి వీర వెంకట సత్యనారాయణ(కేవీ),ఎస్.కే పాషా,
సత్యవరపు బాలగంగాధర్,పాండు రంగా,సింహాద్రి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు