మౌలిక వసతులు కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నాం: మంత్రి తుమ్మల

We are working towards creating infrastructure: Minister Thummalaనవతెలంగాణ – భువనగిరి
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు వ్యవసాయ భూములకు నీరు, రహదారులు, మౌలిక వసతులు  కల్పించడం  జరుగుతుందని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం  భువనగిరి నూతన వ్యవసాయ  మార్కెట్ కమిటీ  ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరై  జ్యోతి ప్రజ్వలన చేశారు.  మంత్రి మాట్లాడుతూ నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగానికి కావాల్సిన నిధులు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతులకు మేలు చేసే విధంగా  మార్కెట్ యార్డ్ ల అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులతో అన్ని రకాల పంటలు పండించే విధంగా కమిటీ చైర్మన్ లు కష్టపడి పని చేయాలన్నారు. రైతులు ధైర్యంగా  వ్యవసాయం చేసుకునేందుకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. మార్కెట్ కమిటీ యార్డ్ లకు గోడౌన్లు, కాంప్లెక్స్, భవనాలు మంజూరు చేయడం  జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటలు ధాన్యం కొనుగోలు సెంటర్లు లో అమ్మిన మూడు రోజుల్లోనే రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన సన్న ధాన్యానికి రూ 500  బోనస్  ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగిందని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని  తెలిపారు. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు సేవ చేసే  భాగ్యం  నూతన పాలకవర్గ సభ్యులకు దక్కిందన్నారు.  బాధ్యతగా పనిచేసి మార్కెట్ కమిటీ అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో   జిల్లా గణనీయంగా ముందున్నారు. రైతు బాగుంటేనే, గ్రామాల అభివృద్ధి చెందుతాయని  తెలిపారు. సన్న వడ్లకు రూ. 500  బోనస్ గా ఇవ్వడం జరిగిందన్నారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం  అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  నూతనంగా ఎన్నుకున్న పాలకమండలి   పదవులు బాధ్యతతో  నిర్వహించి అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. నాలుగు మండలాల్లో  15 రోజులలో అత్యధికంగా వడ్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు.  చెరువులు కూడా నింపడం జరిగిందని  అన్నారు. రైతులకు రుణ మాఫీ చేయడం కూడా జరిగిందని  అన్నారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ సంవత్సర పరిపాలన మాకు, మా నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి,రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,గ్రంథాలయ  చైర్మన్ అవేజ్ చిస్తీ, పిసిసి సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్  చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు,  మార్కెట్ కమిటీ చైర్మన్  కునుకుంట్ల రేఖ బాబురావు, వైస్ చైర్మన్ రాజేష్ పైలెట్, పాలకవర్గ సభ్యులు  తాడూరి నరసింహ,  రంగా కృష్ణ, చిన్నం శ్రీనివాస్, పిట్టల రజిత, రేణిగుంట లాలయ్య, యాదవ్, దేశెట్టి చంద్రశేఖర్, మద్ది అంజిరెడ్డి, కే. శ్యామ్, కుక్క దానయ్య, బానోత్ దేవి సింగ్, ధరావత్ శ్రీను పొద్దుటూరి ప్రశాంత్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.