
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పెడరేషన్ (టిబ్యూజెఏప్) రాష్ట్ర కార్యదర్శి, గోదావరిఖని నవ తెలంగాణ ఆర్సీ ఇంచార్జి పైడాకుల రాధిక భిక్షపతి దంపతుల కూతురు చిన్నారి పైడాకుల అద్విత నూతన వస్ర్తలంకరణ కార్యక్రమం బుధవారం వారి స్వగ్రామమైన తాడిచెర్లలో నిర్వహించారు. బుధవారం రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు కార్యక్రమానికి హాజరై అశ్విర్వదించారు. భవిష్యత్ లో ఉన్నత చదువులు చదువుతూ గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి,ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు దండు రమేష్,మండల పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,నాయకులు దన్నపనేని సురేష్ రావు,కేశారపు చెంద్రయ్య, బొబ్బిలి రాజు గౌడ్,ఇందారపు చెంద్రయ్య,రాజ్ కుమార్, ప్రభాకర్,దుర్గ ప్రసాద్ పాల్గొన్నారు.