పొట్లపల్లిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో అభిమానులు , పార్టీ కార్యకర్తల మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్  జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.