
స్టడీ టూర్ లో భాగంగా శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పర్యటించారు. శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగాపూర్ లో నిరంజన్ షావలి దర్గాను సందర్శించారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మన్ననూరు చింతల చెరువు లో నిర్వహించిన వనం మహోత్సవం కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నీరు పోశారు. మొక్కలు నాటడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా వణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు, జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ వారికి ఘనంగా స్వాగతం పలికారు. పకృతి ప్రాంతాలను, జలపాతాలు ఉన్న ప్రాంతాలను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యం ఎంచుకుంది. అందులో భాగంగానే మంత్రులు ఎమ్మెల్యేలు నల్లమల్లలు పర్యటిస్తున్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి వాకటి శ్రీహరి, అన్నం శ్రీనివాస్ రెడ్డి, శంకర్ మధుసూదన్ రెడ్డి, మెగా రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పర్యాటకశాఖ సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పిసిసిఎఫ్ ఆర్ ఎం డోబ్రియాల్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎం.డి ప్రకాష్ రెడ్డి, పురావస్తు శాఖ డైరెక్టర్ భారతి హోళికేరి, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.