రేపు లక్నవరం సరస్సును సందర్శించడానికి వస్తున్న మంత్రులు

– పాలడుగు వెంకట కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట : మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన లక్నవరం సరస్సును సందర్శించేందుకు మంగళవారం మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మరియు జూపల్లి కృష్ణారావు లు వస్తున్నారని  ఘనస్వాగతం పలకాలని మండల నాయకులకు పాడు వెంకట కృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో వెంకటకృష్ణ  మాట్లాడుతూ మంగళవారం  మధ్యాహ్నం 02:00 గంటలకు గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సును సందర్శించడానికి తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మహబాద్ ఎంపీ బలరాం నాయక్  విచ్చేస్తున్నారు. కావున గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ హాజరయి వారికి ఘనస్వాగతం పలకాలని కోరుతున్నానని తెలిపారు.