– ఉత్తమ పర్యాటక రాష్ట్రమే లక్ష్యంగా టూర్ : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి నిమిత్తం విదేశాల్లో అధ్యయనం చేయడానికి వెళ్లిన రాష్ట్రమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బందానికి దక్షిణ కొరియాలో భారత రాయబారి శుక్రవారం ఘన స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకెళ్లినట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కొరియా రాజధాని సీయోల్లోని వాటర్ రివర్ ఫ్రంట్‌ను తాము అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నదుల వెంట సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన ప్రకతి రమణీయ దశ్యాలు ఉన్నాయన్నారు. కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్ అభివద్ధికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, మహబుబ్ నగర్‌లోని ట్యాంక్ బండ్ అభివృద్ధికి చర్యటు తీసుకోనున్నట్టు ఆయన తెలిపారు.