మైనర్ బాలురు వాహనాలు నడుపుతే జైలు శిక్ష తప్పదని తొగుట ఎస్ఐ రవికాంత్ రావు అన్నారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిబ్బందితో కలిసి తొగుట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లకు, వాహన దారులకు ట్రాఫి క్, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించా లని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు. మైనర్లు బైక్ ఇచ్చి నడిపితే తండ్రులకు జైలు శిక్ష తో పాటు లైసెన్స్ రద్దు అవు తుందని తెలిపారు. పరిమితికి మించి ఆటోలో ప్యాసింజర్ ఎక్కించుకోవద్దని అన్నారు. వాహనా లకు సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.