ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ జెసిఐ ఇందుర్ సంయుక్తంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ రెసిడెన్షియల్ ఇంటర్ కాలేజ్, నాగారంలో డ్రగ్స్ నియంత్రణపైన అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఏది ఎస్ఐ మల్లేష్ పిల్లలకు మత్తు కు లోనవకుండ చదువు పై దృష్టి సాధించి తల్లి తండ్రులకు, కాలేజీ మంచి పేరు తేవాలని మాట్లాడారు. ఈ కార్యక్రమం లో జెసిఐ ఇందురు అధ్యక్షులు నయన్, ఆర్ ఎల్ సి మహమ్మద్ అబ్దుల్ బషీర్, జెసిఐ ఇందూరు పూర్వ అద్యక్షులు విజయనంద్ , ఇలియాస్, మౌలానా, యోగి, విద్యార్థులు పాల్గొన్నారు.