మైనర్లు ద్విచక్ర వాహనాలను నడపకూడదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జాతీయ భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ శివాజీ నగర్ లో గల రామకృష్ణ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ మాట్లాడుతూ.. మైనర్లు బైకులు డ్రైవ్ చేయొద్దని సూచించారు. హెల్మెట్ లేకుండా లైసెన్సులు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయొద్దునిర్వహించారురోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయమని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ , రాహుల్ ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.