రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి: మిరియం వెంకటేశ్వర్లు

నవతెలంగాణ – మునుగోడు
రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులుమిరియం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారంమునుగోడు మండల పరిధిలోనికల్వకుంట్ల గ్రామంలో మునుగోడు నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను బడ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. నిరంకుశత్వ, మతోన్మాదం రాజకీయాలు భారతదేశానికి ప్రమాదం అని ప్రజలు తీర్పు చెప్పారని, మూడోసారి అధికారం వచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. ‘నీట్ ‘ పేపర్ కు లీకేజీ కారణమైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి, కేంద్ర విద్యా శాఖ మంత్రి  తక్షణమే రాజీనామాచేయాలన్నారు. నేటికీ మణిపూర్ మంటలు ఎగిసి పడుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి నాగ, కుకీజాతుల మధ్య శాంతిని నెలకొల్పాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి దేశంలోని రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంఎన్నికల ముందు ఏటా 2000 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ అమలు చేయకుండా, నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా నిరుద్యోగులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం  3 నేరా చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ఫెడరల్  విధానాన్ని అనుసరించి రాజకీయాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. రాజ్యాంగ సంస్థలైనఈడి , సిబిఐ  ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర సంస్థలుగా ఉండే విధంగా చూడాలన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ శక్తుల నుండి విడిపించి ప్రభుత్వ రంగంలో ఉంచాలన్నారు. భారతీయ పౌరసత్వ చట్టాలు అన్నిటిని గౌరవించి భిన్నత్వంలో ఏకత్వని కాపాడాలని ఆయన కేంద్ర ప్రభుత్వాని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ- ప్రజా సంఘాల నిర్మాణం అనే అంశంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుల తుమ్మల వీరారెడ్డి బోధించారు.క్లాస్ ప్రిన్సిపల్ గా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  పాలడుగు నాగార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అయితగొని విజయ్ కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య,నాంపల్లి చంద్రమౌళి, మండల కార్యదర్శిలు మిర్యాల  భరత్, ఏర్పుల యాదయ్య, వరికుప్పల ముత్యాలు, బొట్టు శివకుమార్, జెర్రిపోతుల ధనంజయ గౌడ్, నారగోని నరసింహ తదితరులు పాల్గొన్నారు.