వరి పంటలను పరిశీలించిన మిరుదొడ్డి వ్యవసాయ అధికారి మల్లేశం

నవతెలంగాణ – మిరు దొడ్డి 
కాండం తొలగించి పురుగు అధికంగా ఉండడం వల్ల రైతులు వేసిన వరి పంట అధికంగా నష్టం కలుగుతుందని మండల వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు గురువారం  ఆయన వరి పంట పొలాలను పరిశీలించారు . వరిలో   కాండం తొలుచు పురుగు అధికంగా ఉండడం వలన రైతులు చేయవలసిన యాజమాన్య పద్ధతులను అవలంబించాలని పిలక దశలో ఉన్న వరి పైరుకు ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3g గూలికలు, 10 కిలోలు లేదా కార్తప్ హైడ్రోక్లోరైడ్  4g గుళికలు 8 కిలోలు చల్లుకోవాలి చిరు పుట్ట దశలో పురుగు ఉదృతి గమనించినట్లయితే కర్తప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ 2 gr/ltr లేదా క్లోరంట్రా నిలిప్రోల్ 0.3 ఎమ్ఎల్ లేదా ఇసో సైక్లో సిరం 0.6 ఎమ్ఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలన్నారు.   వరిలో గంధక ప్రభావం వలన వేర్లు కుళ్ళి వాసన రావడం జరుగుతుందని  అన్నారు . దాని నివారణకు హెక్సా కొనాజోల్ లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ మందులను వాడవల్సిందిగా తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రేణుక తదితరులు పాల్గొన్నారు.