ఉన్నత ఫలితాలు సాధించాలి: మిరుదొడ్డి ఎస్సై పరశురాం

నవతెలంగాణ – మిరు దొడ్డి 
కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని మిరుదొడ్డి ఎస్సై పరశురాం అన్నారు శనివారం మిరు దొడ్డి లోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ  సందర్భంగా ఆయన  మాట్లాడుతూ విద్యార్థులకు వార్షిక పరీక్షల హాల్ టికెట్స్ అందజేస్తూ విద్యార్థులకు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలన్ని అన్నారు, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని, సెల్ ఫోన్స్ ని సద్వినియోగం చేసుకోగలరని ఫోక్సొ చట్టం వంటి కఠిన చట్టాలు ఉన్నాయని అన్నారు .మీ భవిష్యత్తు మీ చేతులలో ఉందని, విద్యార్థులు ఈ దశలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు అందించారు. కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీనివాస్  మాట్లాడుతూ విద్యార్థులు వార్షిక పరీక్షలకు కష్టపడి చదివి స్టేట్ లెవెల్ ర్యాంకులు తీసుకురాగలరని క్రమశిక్షణతో పరీక్షలు రాయగలరని విద్యార్థులకు తగు సూచనలు అందించారు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మంచి మార్గాన్ని ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని సూచించారు నేటి భారత భావిపరులు కావడానికి విద్యార్థులతోనే సాధ్యమైతుందని అన్నారు.