పోస్టల్ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: మీస తిరుమలేష్

నవతెలంగాణ – శంకరపట్నం
తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అధ్వర్యంలో అందిస్తున్న భీమాను ప్రజలు వినియోగించుకోవాలని శనివారం శంకరపట్నం మండల కేంద్రంలోని తాడికల్ సబ్ పోస్ట్ ఆఫీస్  సబ్ పోస్ట్ మాస్టర్ మీస తిరుమలేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలాశాఖ,ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అధ్వర్యంలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో గాయాలతో ఆస్పత్రిలో చేరినా వైద్య ఖర్చులు పొందడంతోపాటు పాలసీ దారు ప్రమాదవశాత్తు మృతి చెందినా, ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం కలిగినా, పక్షవాతం సంభవించిన భీమా మొత్తంతోపాటు, అంత్యక్రియల కొరకు రూ.5వేలు, పాలసీ దారుని పిల్లల విద్య కోసం ఒక లక్ష రూపాయలు,ప్రమాదంలో ఎముకలు విరిగితే రూ.25 వేల వరకు పొందవచ్చన్నారు. పాలసీ గడువు కాలంలో ఒకసారి ఆరోగ్య తనిఖీ, అపరిమిత టెలి కన్సల్టెన్సీ ప్రయోజనాలు పాందవచ్చనీ తెలిపారు. ఈ భీమా పథకాలను సద్వినియోగం చేసుకుంటే తమపై ఆధారపడిన కుటుంబానికి ఎలాంటి లోటు లేకుండా ప్రయోజనం పొందుతారని పేర్కోన్నారు. తపాలా శాఖ, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అధ్వర్యంలో అందిస్తున్న భీమాను ప్రజలు వినియోగించుకోవాలని వీటితోపాటు పిపిఎఫ్, సుకన్య సమృద్ధి, మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ,రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరిన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వినియోగదారులను కోరారు.