మీషోకు తొలిసారి లాభాలు

Misho's first profitహైదరాబాద్‌ : ఈ-కామర్స్‌ సంస్థ మీషో తొలిసారి భారత్‌లో లాభాలను ప్రకటించింది. ప్రస్తుత ఏడాది జులైలో ఆర్డర్లు పెరగడంతో పాటు వ్యయాలు తగ్గించుకోవడంతో లాభదాయకతను సాధించామని మీషో ఫౌండర్‌, సీఈఓ విదిత్‌ అత్రేరు తెలిపారు. తాము అంచనా వేసినదానికంటే ముందే లాభాలు ఆర్జించినట్టు ఆ సంస్థ పేర్కొంది. గడిచిన 12 నెలల్లో ఆర్డర్లలో 43 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. ఆదాయంలోనూ 54 శాతం పెరుగుదలను నమోదు చేశామని పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో 140 మిలియన్ల లావాదేవీలు జరిగాయని తెలిపింది.