నవతెలంగాణ – కమ్మర్ పల్లి
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ బాలే రవీందర్ తెలిపారు. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పోతు మని వర్ధన్, మల్లం రుషిక 9.8 జిపిఏ సాధించి పాఠశాల టాపర్లుగా నిలిచినట్లు తెలిపారు. అదేవిధంగా సోమ అనుష్క, అల్ఫియా 9.5 జిపిఎస్ సాధించినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 100% ఉత్తీర్ణత సాధించడంలో కృషిచేసిన అధ్యాపక బృందానికి, విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.