టెస్ట్ మ్యాచ్ ను వీక్షించిన మిసిమి విద్యార్థులు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ను మండల కేంద్రంలోని మిసిమి  ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం వీక్షించారు.హైదరాబాద్  క్రికెట్  అసోసియేషన్ ( హెచ్ సిఏ ) వారు టెస్ట్ మ్యాచ్ డెవలప్మెంట్ లో భాగంగా, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు కూడ క్రికెట్ పై ఆసక్తిని పెంచడానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతిరోజు పాఠశాలల విద్యార్థులకు 5వేల ఫ్రీ టికెట్స్, ప్రీ భోజనం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మిసిమి ఉన్నత పాఠశాల 8, 9, 10వ తరగతికి  చెందిన 42 మంది విద్యార్థులకు,9 మంది టీచర్లకు అవకాశం కల్పించారు. టెస్ట్ మ్యాచ్ చూసేందుకు  శుక్రవారం రాత్రి పాఠశాల విద్యార్థులు ప్రత్యేక బస్సులు బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం ఉప్పల్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్  మధ్య మెదటి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు క్రికెట్ ఆటను విద్యార్థులు ఆనందోత్సాహాలతో వీక్షించినట్లు పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు.