
బాన్సువాడ పట్టణంలోని బీసీ హాస్టల్ వద్ద ఓ బాలుడు ఏడుస్తూ కనిపించడంతో చుట్టుపక్కల వారు బాలుడు వివరాలు చెప్పకపోవడంతో ఆ కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో బాన్స్వాడ సిఐ టౌన్ కృష్ణ వివిధ సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్ చేయడంతో బాలుని తల్లిదండ్రులు బాలుని గుర్తించి పోలీస్ స్టేషన్కు వచ్చి బాలుని గుర్తించారు. బాన్సువాడ టౌన్ సిఐ కృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం తప్పిపోయిన బాలుని పేరు దేవసోత్ చంద్రకాంత్.( 2) తండ్రి సతీష్ సతీష్. తల్లి రేణుక , పిట్లం మండలం గ్రామం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన వీరు అవసర నిమిత్తం బాన్సువాడలో ఉన్న అక్క ఇంటికి ఇంటికి వచ్చారు. రేణుక తన బాబుని వారి కుటుంబ సభ్యుల వద్ద ఉంచి షాపింగ్ కోసం బాన్సువాడ పట్టణంలోకి వెళ్ళింది. తల్లిదండ్రులు లేకపోవడంతో బాలుడు ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. సతీష్, రేణుక లు ఇంటికి రాగానే బాలుడు కనిపించకపోవడంతో చుట్టుపక్క వెతికిన కనిపించలేదు. అప్పటికే వాట్సాప్ గ్రూపులో తప్పిపోయిన బాలుడు వివరాలు ఫోటో ప్రేచరితం కావడంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలను వెల్లడించడంతో పూర్తి సమాచారం తెలుసుకొని తల్లిదండ్రులకు బాలుని అప్పగించారు. సీఐ కృష్ణకు బాలుని తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.