ఈ నెల 15 న తప్పిపోయిన బాలిక షేక్ మహిర ఆచూకీ దొరికింది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ గ్రామానికి చెందిన చిన్నారి భీంగల్ పట్టణానికి చెందిన తన తాత అమీర్ ఖాన్ ఇంటికి వచ్చింది. మతిస్థిమితం లేని చిన్నారి ఆడుకుంటూ బయటకు వెళ్లి తప్పిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కొరకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక రాతం చెరువులో గుర్రపు దెక్కలో చిక్కుకుని కనిపించడం జరిగింది. స్థానికులు, పోలీసుల సహాయం తో గుర్రపు డెక్కలో చిక్కుకున్న బాలికను బయటకు తీసి తల్లి, తండ్రులకు అప్పగించారు. బాలికను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు తల్లి, తండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.